08/11/2026, Sunday · 03:19:05 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అతి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ ప్రభుత్వం

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 1:05 PM రాష్ట్ర వార్తలు 19

అతి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ ప్రభుత్వం
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి : రాష్ట్రంలోని తీర ప్రాంతంలో మురసు తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. క్రమంగా తుఫాన్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం మురసు తుఫాన్‌పై తాజా సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఈ రోజు (మంగళవారం).. బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నవంబర్ 3వ తేదీ (ఈ రోజు) మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నవంబర్ 4వ తేదీన మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పింది.

మురసు తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలో అత్యధికంగా 56.95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. తాజా నివేదిక ప్రకారం 10,805 మంది నిరాశ్రయులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని పేర్కొంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య బృందాలతోపాటు 108, 102, 104 అంబులెన్సులు అందుబాటులో ఉంచామని చెప్పింది. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రసవానికి గడువు సమీపించిన గర్భిణులను ముందస్తు జాగ్రత్తలో భాగంగా సమీప వైద్య కేంద్రాలకు తరలించామని చెప్పింది.

మురసు తుఫాన్ ప్రభావంతో.. ప్రాథమిక అంచనాల ప్రకారం 30,661 హెక్టార్ల వరి, 21,474 హెక్టార్ల పత్తి, 605 హెక్టార్ల మొక్కజొన్న పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వివరించింది. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు విద్యుత్ శాఖ ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసిందని పేర్కొంది. సాగునీటి చెరువులు, రిజర్వాయర్లు, దిగువ ప్రాంతాల్లో వరద పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకొరిగిన చెట్లు, నీటితో నిండిన రహదారులకు దూరంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. బలహీనమైన ఇళ్లు, పూరిళ్లు, రేకుల షెడ్లలో నివసించే వారు అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

epi prabhutvamatibharivarshaluprajaluapramattamgaumdali

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు