08/11/2026, Sunday · 03:44:24 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రిటైర్డ్ IAS కృపానందం ప్రాసిక్యూట్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 3:04 PM రాష్ట్ర వార్తలు 18

రిటైర్డ్ IAS కృపానందం ప్రాసిక్యూట్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి
Want this news as a newspaper clip?Print News Clip

రిటైర్డ్ ఐఏఎస్ కృపానందం ప్రాసిక్యూట్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ, గనులశాఖ కార్యదర్శిగా కృపానందం బాధ్యతలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నమోదు చేసిన ECIR కేసుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్‌తో పాటు ఇతరులతో కుమ్మక్కై కృపానందం అధికార దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.మైనింగ్ లీజ్ కేటాయింపులో భారతీ సిమెంట్స్‌కు అక్రమ లబ్ధి చేకూర్చేలా వ్యవహరించినట్టు అభియోగాలు నమోదు అయ్యాయి. PMLA ద్వారా వచ్చిన నేరపూరిత ఆస్తులను వైట్ మనీగా మార్చడంలో పరోక్షంగా సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ అభ్యర్థన మేరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(Cr.P.C) సెక్షన్ 197(1) [ప్రస్తుత BNSS, 2023 సెక్షన్ 218] ప్రకారం బి.కృపానందం ప్రాసిక్యూట్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Kirpanandam ProsecutionGovtapprovesRetiredIAS

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు