08/11/2026, Sunday · 03:34:33 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సమాజంలో ఇలాంటి దాడులకు చోటు లేదు.. రాప్తాడు ఘటనపై పవన్ కల్యాణ్.

భవ్య జర్నలిస్ట్ 31/10/2026 3:54 PM రాష్ట్ర వార్తలు 15

సమాజంలో ఇలాంటి దాడులకు చోటు లేదు.. రాప్తాడు ఘటనపై పవన్ కల్యాణ్.
Want this news as a newspaper clip?Print News Clip

 రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థినిపై ఓ యువకుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పాఠశాల తరగతి గదిలో ఉన్న పదో తరగతి బాలికపై చెట్లు నరికే రంపం యంత్రంతో ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. బాలిక తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా బాలిక కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ భరోసా ఇచ్చారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదని హెచ్చరించారు. కాగా, శనివారం ఉదయం పాఠశాలలో ఉన్న విద్యార్థినిపై ఓ యువకుడు దాడికి తెగబడ్డాడు. ఉపాధ్యాయురాలు మ్యాథ్స్‌ క్లాస్‌ చెబుతుండగా.. దుండగుడు హఠాత్తుగా తరగతి గదిలోకి ప్రవేశించాడు. అందరూ చూస్తుండగానే బాలికపై రంపం యంత్రంతో దాడి చేశాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Pawan KalyanplaceattackssocietyincidentRapatu

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు