08/11/2026, Sunday · 03:34:35 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఘన నివాళులు

భవ్య జర్నలిస్ట్ 31/10/2026 8:10 PM వైఎస్సార్ కడప 18

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఘన నివాళులు
Want this news as a newspaper clip?Print News Clip

జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా అదనపు ఎస్పీ (ఏ.ఆర్.) శ్రీ బి. రమణయ్య గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగాఅదనపు ఎస్పీ (ఏ.ఆర్.) శ్రీ బి. రమణయ్య గారు మాట్లాడుతూ, దేశ ఐక్యత, సమగ్రతకు విశేష కృషి చేసిన భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
1875 అక్టోబర్ 31న గుజరాత్‌లో జన్మించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 560కు పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన దృఢ సంకల్పం, నాయకత్వం, దేశభక్తి భావి తరాలకు ఆదర్శప్రాయమని తెలిపారు.
ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2014 నుంచి అక్టోబర్ 31వ తేదీని జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఐక్యత, సోదరభావంతో మెలుగుతూ దేశ సమగ్రత, భద్రతను కాపాడేందుకు కృషి చేయాలని, ఐక్య మరియు శాంతియుత భారతదేశ నిర్మాణానికి పునరంకితం కావాలని అదనపు ఎస్పీ శ్రీ బి. రమణయ్య గారు పిలుపునిచ్చారు.
కార్యక్రమం లో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఘన నివాళులు

pays tributesDistrictPoliceDepartmentSardarVallabhbhaiPatelhis

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు