08/11/2026, Sunday · 03:08:41 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఐదు రెవెన్యూ డివిజన్లలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు .....

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 12:37 PM వైఎస్సార్ కడప 9

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఐదు రెవెన్యూ డివిజన్లలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు .....
Want this news as a newspaper clip?Print News Clip

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఐదు రెవెన్యూ డివిజన్లలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు ..... జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి

కడప, నవంబర్ 6 : జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఇందులో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఐదు రెవెన్యూ డివిజన్లలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

* బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బి.కోడూరు, మైదుకూరు, శ్రీ అవదూత కాశీ నాయన, బి. మటం, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల మండలాలకు సంబంధించి బద్వేల్‌లోని అంబేద్కర్ గురుకులాన్ని కేంద్రంలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

* జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మైలవరం, దువ్వూరు, పెద్దముడియం, ప్రొద్దుటూరు మండలాలకు సంబంధించి జమ్మలమడుగులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

* కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు సంబంధించి కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం పాలటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

* పులివెందుల రెవెన్యూ డివిజన్ పరిధిలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాలకు సంబంధించి పులివెందులలోని రమనప్ప సత్రం, జడ్ .పి హై స్కూల్ లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

* రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నందలూరు, రాజంపేట, టి.సుండుపల్లి, వీరబల్లి మండలాలకు సంబంధించి రాజంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కౌంటింగ్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

--------///---------

ఇదీ చదవండి :: యూపీలో విషాదం.. ట్రాలీని ట్రక్కు ఢీకొని ఐదుగురు మహిళల మృతి

revenue divisionsEstablishmentcountingcentresfiveZPTCMPTCelections

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు