08/11/2026, Sunday · 03:54:34 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ...

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 8:01 PM వైఎస్సార్ కడప 8

ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ...
Want this news as a newspaper clip?Print News Clip
  • జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
  • అభ్యర్థులకు భద్రత కల్పించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు

వైఎస్సార్‌ కడప జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన శుక్రవారం ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.

శుక్రవారం కడపలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తోపాటు... జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి కార్యాలయ ప్రాంగణంతో పాటు నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.

నామినేషన్‌ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్లు, 500 మీటర్ల పరిధుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని, తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. కేంద్రాల వెలుపల నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

కడప, రాజంపేట, మైదుకూరు ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు అవసరమైన పోలీసు రక్షణ కల్పించి, నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎవరైనా భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

పోలీసు నియంత్రణ గది నిరంతరం అందుబాటులో ఉంటుందని, అత్యవసర సహాయం కోసం 112 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని అభినందించారు. ఇదే విధంగా ఎన్నికల తదుపరి ప్రక్రియలోనూ భద్రతా చర్యలను కొనసాగిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

nomination processQuietZPTCMPTC

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు