08/11/2026, Sunday · 03:34:34 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రబ్బర్ బుల్లెట్ గాయపడిన యువకుడికి వైయస్ జగన్ పరామర్శ

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 1:51 PM వైఎస్సార్ కడప 18

రబ్బర్ బుల్లెట్ గాయపడిన యువకుడికి వైయస్ జగన్ పరామర్శ
Want this news as a newspaper clip?Print News Clip

పార్టీ అండగా ఉంటుందని భరోసా

​పులివెందుల అర్బన్ అక్టోబర్ 28:

పోలీసుల రబ్బర్ బుల్లెట్ తూటా తగిలి గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గండికోట పవన్ కుమార్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

​పులివెందుల పట్టణానికి చెందిన గండికోట నాగభూషణం కుమారుడు పవన్ కుమార్,ఈ నెల 17న నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల్లో పోలీసుల కాల్పులకు గురయ్యారు.ఆ సమయంలో కాలికి రబ్బర్ బుల్లెట్ బలంగా తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.

​ప్రస్తుతం పులివెందుల పర్యటనలో ఉన్న వైయస్ జగన్‌ను బాధితుడు పవన్ కుమార్ స్వయంగా కలిసి,ఆ రోజు జరిగిన ఘటనను వివరించారు.పవన్ ఆరోగ్య పరిస్థితిని,గాయం నయమవుతున్న తీరును జగన్ అడిగి తెలుసుకున్నారు.

​ఎలాంటి ఆందోళన చెందవద్దని,ధైర్యంగా ఉండాలని పవన్ కుమార్‌కు ఆయన ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులు,నాయకత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తాయని ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

jagan paramarsharabbarbulletgayapadinayuvakudikivaiyas

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు