08/11/2026, Sunday · 03:34:32 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఓటు వేసి నేరుగా ఇంటికి వెళ్లాలి’.. జగన్‌కు డీఐజీ సూచన

భవ్య జర్నలిస్ట్ 31/10/2026 4:00 PM వైఎస్సార్ కడప 16

ఓటు వేసి నేరుగా ఇంటికి వెళ్లాలి’.. జగన్‌కు డీఐజీ సూచన
Want this news as a newspaper clip?Print News Clip

నగరంలోని ఆర్ట్స్ కాలేజ్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీని డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పులివెందుల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చన్నారు. ఓటు వేసిన తర్వాత జగన్.. నేరుగా ఇంటికి వెళ్లాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా పులివెందుల పట్టణంలో తిరిగేందుకు ఆయనకు అనుమతి లేదన్నారు. పులివెందులలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా పులివెందుల, జమ్మలమడుగు, కడపలో అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది పోలీసు బలగాలను మోహరించినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు.కాగా.. పులివెందుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎన్నికల రోజు తాను పులివెందులలోనూ ఉంటానని, ఎవరొస్తారో చూసుకుంటానంటూ మాస్ వార్నింగ్‌ ఇవ్వడం రాజకీయంగా రచ్చకు దారి తీసింది. అయితే జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

home digVotestraightsuggestionJagan

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు