08/11/2026, Sunday · 03:18:54 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా పోలింగ్

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 10:28 PM వైఎస్సార్ కడప 20

జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా పోలింగ్
Want this news as a newspaper clip?Print News Clip

 ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన జరగలేదు

అవినాష్ రెడ్డి ఆరోపణలకు బీటెక్ రవి స్ట్రాంగ్ కౌంటర్!*

అవినాష్ రెడ్డి మీరు చేసిన దాడులు మరిచిపోయారా?

టీడీపీపై నిందలా? 

ఇటీవల ప్రతి చిన్న సంఘటనకు ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీపై రిగ్గింగ్, దౌర్జన్యాలు, పోలీసుల వేధింపులంటూ ఆరోపణలు చేయడం అవినాష్ రెడ్డికి అలవాటుగా మారిందని బీటెక్ రవి విమర్శించారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,

లింగాల మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా, స్వేచ్ఛగా పోలింగ్ జరిగిందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన నామినేషన్ సమయంలో తమపై జరిగిన దాడుల కారణంగా కేసులు ఎదుర్కొన్నవారు కూడా ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలని కోరుకున్నారని తెలిపారు.

అయితే పులివెందుల మండలంలోని ఎర్రిపల్లె, వేముల ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, రాళ్ల దాడులు, రాకెట్లు ప్రయోగించడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, విజువల్స్ తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

ఒకవైపు టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణలు చేస్తూ, మరోవైపు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులను పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలను బట్టి ఒకసారి ఒకలా, మరోసారి మరోలా మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.

ఎన్నికలు ముగిశాయి.. ఇకనైనా రాజకీయ ఆరోపణలు, ప్రెస్‌మీట్లకే పరిమితం కాకుండా పులివెందుల అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ప్రజల సమస్యలపై మాట్లాడండి నియోజకవర్గ అభివృద్ధికి మీ వంతు సహకారం అందించండి. ఇదే మీకు మా సూచన అని హితువు

 పలికారు.

ఇదీ చదవండి :: 'అక్టోబర్‌ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!

election peacefulZPTCfreepolling

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు