08/11/2026, Sunday · 03:08:42 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీలపై ఏఐసీసీకి టీపీసీసీ చీఫ్ నివేదిక

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 1:13 PM హైదరాబాద్ 10

తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీలపై ఏఐసీసీకి టీపీసీసీ చీఫ్ నివేదిక
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌‌లో జరుగుతున్న పంచాయతీలపై ఏఐసీసీకి రిపోర్ట్ చేరింది. అన్ని పంచాయతీలపై ముందస్తు సమాచారంతో అధిష్ఠానానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రిపోర్ట్ పంపించారు. మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్మీకాంతరావులకు మధ్య జరిగిన వివాదంపై నివేదిక పంపారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా రిపోర్ట్ పంపించారు. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ అంశాన్ని హైకమాండ్‌కు చేరవేశారు. అంతేకాకుండా పెద్దపల్లిలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానానికి పీసీసీ చీఫ్ రిపోర్ట్ పంపారు. త్వరలోనే అన్ని పంచాయతీలపై ఇరువర్గాలతో మాట్లాడి పూర్తి నివేదికను పీసీసీ చీఫ్ తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న ఇబ్బందులన్నింటినీ పరిష్కరించే యోచనలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లో భాగంగా పార్టీలో ఎక్కడెక్కడ గొడవలు, ఇబ్బందులు ఉన్నాయి.. అలాగే ఆధిపత్య పోరు ఎక్కడ ఉందనే దానిపై లిస్ట్ అవుట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్మీకాంతరావు మధ్య నెలకొన్న వివాదాన్ని సర్దుమణిగించేందుకు ప్రయత్నం చేశారు. అయితే నిన్న కేబినెట్ సమావేశం ఉండటంతో మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీభవన్‌కు రాలేదు.

అలాగే.. పెద్దపల్లి కాంగ్రెస్ పంచాయతీ గాంధీభవన్‌కు చేరింది. ఎంపీ వంశీ కృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు మధ్య చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈరోజు గాంధీభవన్‌కు రావాల్సిందిగా మంత్రి, ఎంపీని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. వంశీ వర్గం నేతల సస్పెన్షన్, మంత్రి శ్రీధర్ బాబుకు ఎంపీ రాసిన లేఖ.. ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలకు కారణంగా మారిందని చర్చ జరుగుతోంది. దీంతో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పీసీసీ చీఫ్ ప్రయత్నిస్తున్నారు. ఈరోజు శ్రీధర్ బాబు, వంశీ గాంధీభవన్‌కు వస్తారా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు నిధుల విడుదలలో జాప్యం విషయంలో కాంగ్రెస్ సర్కార్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ సీరియస్‌గా తీసుకుంది. గాంధీభవన్‌కు రావాల్సిందిగా ఎమ్మెల్యేకు ఫోన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత గాంధీభవన్ వచ్చి వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. వీటితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంతో పాటు మిగిలిన చోట్ల జరుగుతున్న వ్యవహారాలపై మహేశ్ కుమార్ గౌడ్ దృష్టిసారించారు. వీలైనంత త్వరగా పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను పరిష్కరించేందుకు పీసీసీ చీఫ్ కసరత్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :: కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు.

Chief ReportTPCCAICCTelanganaCongressPanchayats

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు