08/11/2026, Sunday · 03:19:05 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

భారత్‌కు కోట్ల ఆదాయం.. మాకు చిల్లిగవ్వ కూడా రాదు: విండీస్ సీఈవో

భవ్య జర్నలిస్ట్ 16/10/2026 8:00 PM క్రీడలు 14

భారత్‌కు కోట్ల ఆదాయం.. మాకు చిల్లిగవ్వ కూడా రాదు: విండీస్ సీఈవో
Want this news as a newspaper clip?Print News Clip
  • ద్వైపాక్షిక సిరీస్‌ల ఆదాయ పంపిణీపై క్రిస్ డెహ్రింగ్ అసంతృప్తి
  • భారత్‌కు 20–30 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని వ్యాఖ్య
  • 1997లో మారిన ఐసీసీ నిబంధనలే అసమానతలకు కారణమని ఆరోపణ
  • ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్ద దేశాలకు ఒక న్యాయం, చిన్న దేశాలకు మరో న్యాయం జరుగుతోందంటూ క్రికెట్ వెస్టిండీస్ సీఈవో క్రిస్ డెహ్రింగ్ గళమెత్తారు. భారత్‌లో పర్యటించి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం వల్ల తమ బోర్డుకు ఎలాంటి ఆదాయం రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆతిథ్య దేశంగా భారత్ భారీ మొత్తంలో సంపాదిస్తోందని పేర్కొన్నారు. విజ్డన్ క్రికెట్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఉదాహరణగా ప్రస్తావించారు.

ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్న టీ20 సిరీస్ ద్వారా భారత్‌కు సుమారు 20 నుంచి 30 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని డెహ్రింగ్ తెలిపారు. అయితే ఈ సిరీస్‌లో పాల్గొంటున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు మాత్రం ప్రసార హక్కుల ద్వారా నేరుగా ఆదాయం లభించడం లేదని చెప్పారు. ఈ పరిస్థితికి 1997లో అంతర్జాతీయ క్రికెట్ మండలి సభ్య దేశాలు తీసుకున్న నిర్ణయమే కారణమని ఆయన వివరించారు. అప్పటివరకు పర్యటించే జట్లకు ఆతిథ్య బోర్డులు కొంత మొత్తాన్ని చెల్లించే విధానం ఉండేదని, ఆ ఏడాది 9-1 ఓట్లతో నిబంధనలు మార్చడంతో ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కుల ఆదాయం ఆతిథ్య బోర్డుకే దక్కే విధానం అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు.

జనాభా, మార్కెట్ పరిమాణం ఎక్కువగా ఉన్న దేశాలు భారీ ఆదాయాన్ని పొందుతుంటే, చిన్న దేశాల క్రికెట్ బోర్డులు ఆర్థికంగా వెనుకబడుతున్నాయని డెహ్రింగ్ అభిప్రాయపడ్డారు. భారత్ వంటి భారీ మార్కెట్‌తో పోలిస్తే సెయింట్ కిట్స్ వంటి చిన్న దేశాలకు ఆదాయ అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ఈ విధానం వెస్టిండీస్ క్రికెట్ ఆర్థిక పతనానికి దారితీస్తుందని తాను గతంలోనే హెచ్చరించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడితో ఆటగాళ్ల వేతనాల్లో కోతలు విధించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న వెస్టిండీస్ బోర్డు నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆదాయ పంపిణీ వ్యవస్థపై మరోసారి చర్చకు తెరలేచింది.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

India willnotgetcroresrevenueWestIndiesCEO

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు