08/11/2026, Sunday · 03:54:39 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖను అప్రమత్తం చేసిన మంత్రులు అనిత, గొట్టిపాటి

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 4:10 PM రాష్ట్ర వార్తలు 10

అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖను అప్రమత్తం చేసిన మంత్రులు అనిత, గొట్టిపాటి
Want this news as a newspaper clip?Print News Clip

 అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖను ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు. డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు ఈరోజు (ఆదివారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు విద్యుత్ అధికారులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు.వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి..
విద్యుత్ సమస్యలు తలెత్తితే.. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రులు సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ శాఖలో జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులంతా అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇతర శాఖలతో విద్యుత్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని మార్గనిర్దేశం చేశారు.

విద్యుత్ సమస్యలుంటే 1912 నంబర్‌కు ప్రజలు సమాచారం అందించాలి..

25 వేల స్తంభాలను, ఇతర సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేసినట్లు అధికారులు.. మంత్రులకు వెల్లడించారు. తుఫాన్‌ తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలకు అదనపు సిబ్బందిని పంపేందుకు SPDCL సన్నద్ధం కావాలని ఆదేశించారు. తుఫాన్‌, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. కిందపడిన కరెంట్ వైర్లు, స్తంభాల దగ్గర ప్రజలు జాగ్రత్త వహించాలని మార్గనిర్దేశం చేశారు. విద్యుత్ సమస్యలుంటే 1912 నంబర్‌కు ప్రజలు సమాచారం అందించాలని మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ కోరారు.ః

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Ministers AnitaGottipatialertedpowerdepartmentwakeCycloneRannab

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు