అభయాంజనేయ స్వామికి విశేష పూజలు

పులివెందుల పట్టణ పరిధిలోని కోతి సమాధి వద్ద గల అభయాంజనేయ స్వామి దేవస్థానము నందు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులివెందుల గ్రామ సరిహద్దులో గల అభయాంజనేయ స్వామి ఆలయం నందు స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుల సిద్దు స్వామి అభిషేకాలు ఆకు పూజలు అనంతరం ప్రత్యేక అలంకరణలో అభయాంజనేయ స్వామి భక్తులకు దర్శనం ఇవ్వగా మహా మంగళహారతి తో ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగానే ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామికి శుభకరమైన శనివారం
నిర్వహించే పూజాధికాలతో పాటు తీర్థ ప్రసాద కార్యక్రమాలకు అత్యధిక ప్రాముఖ్యత కలదని ఆలయ అర్చకులు తెలియజేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన ఉభయదారులందరికీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు మరియు భక్తజనం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: 'అక్టోబర్ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!












