08/11/2026, Sunday · 03:44:23 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక నిఘా..!

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 5:17 PM వైఎస్సార్ కడప 7

సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక నిఘా..!
Want this news as a newspaper clip?Print News Clip
  • జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి
  • నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
  • ఎన్నికల వ్యయ పరిధిలోకి చెల్లింపు ప్రచారాలు, ప్రాయోజిత పోస్టులు
  • అభ్యర్థుల ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే పోస్టులు, చిత్రాలు, వీడియోలు, లఘు చిత్రాల విషయంలో కంటెంట్ క్రియేటర్లు, సామాజిక మాధ్యమాల ఇన్ ఫ్లూయన్సర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు.
ఈ సందర్భంగా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా, కులాలు, మతాలు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లేదా అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎలాంటి ప్రచార సామగ్రిని రూపొందించవద్దని స్పష్టం చేశారు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వెలువడే ప్రచార అంశాలపై ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల తరఫున సామాజిక మాధ్యమాల్లో నిర్వహించే చెల్లింపు ప్రచారాలు, ప్రాయోజిత పోస్టులు, ప్రచార ఒప్పందాల ద్వారా చేసే కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు అభ్యర్థుల ఎన్నికల వ్యయంలోకి వస్తాయని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించే వారికి చెల్లించే రుసుములను ఎన్నికల వ్యయ పరిశీలనలో భాగంగా నమోదు చేస్తామని, సంబంధిత వివరాలను ఎన్నికల అధికారులకు పారదర్శకంగా వెల్లడించాలని సూచించారు.
అభ్యర్థులకు సంబంధించిన ప్రచార ప్రకటనలు, వీడియోలు తదితర ఎన్నికల ప్రచార సామగ్రిని సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే ముందు నిబంధనల ప్రకారం జిల్లా స్థాయి మీడియా ధ్రువీకరణ, పర్యవేక్షణ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు అనుమతి పొందాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ పరిణామాలకు తావులేకుండా బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని సూచించారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Special SurveillanceElectionCampaignSocialMedia

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు