08/11/2026, Sunday · 03:08:41 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

టీడీపీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న మహ్మద్‌సాధిక్‌ (జనసేన), 39వ వార్డు అభ్యర్థి దామోదర్‌ యాదవ్‌

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 12:53 PM విశాఖపట్నం 12

టీడీపీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న మహ్మద్‌సాధిక్‌ (జనసేన), 39వ వార్డు అభ్యర్థి దామోదర్‌ యాదవ్‌
Want this news as a newspaper clip?Print News Clip

డాబాగార్డెన్స్‌ : విశాఖ కూటమిలో విభేదాలు బహిర్గతమయ్యాయి. టీడీపీ దక్షిణ ఇన్‌చార్జ్‌ సీతంరాజు సుధాకర్‌పై జనసేన, బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు అన్యాయం చేశారంటూ ఆయనను పార్టీ నుంచి, కూటమి నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇటీవల జరిగిన గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రెండో సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన 36వ వార్డు జనసేన అభ్యర్థి మహ్మద్‌ సాధిక్, 39వ వార్డు బీజేపీ అభ్యర్థి దామోదర్‌ యాదవ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తాను బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా 39వ వార్డు నుంచి పోటీ చేశానన్నారు. కూటమి పెద్దలతో చర్చించిన అనంతరం దక్షిణ జోన్‌లో బీజేపీకి కేటాయించిన ఏకైక సీటు తనకు ఇచ్చారని తెలిపారు. అయితే టీడీపీ సౌత్‌ ఇన్‌చార్జ్‌ సీతంరాజు సుధాకర్‌ తనకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌

అభ్యర్థిని నిలబెట్టి, ఆయనకు సహకరించారని ఆరోపించారు. కూటమి అభ్యరి్థకి సహకరించాల్సిన సమయంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి విజయానికి ప్రయతి్నంచడం ద్వారా కూటమిలో విభేదాలు సృష్టించారని విమర్శించారు. బీజేపీని కానీ, ఆ పార్టీ అభ్యర్థులను కానీ అవమానిస్తే సహించేది లేదని, సీతంరాజు సుధాకర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 36వ వార్డు జనసేన అభ్యర్థి మహ్మద్‌ సాధిక్‌ మాట్లాడుతూ.. గతంలో కార్పొరేతన అనుచరులకు టికెట్లు రాలేదనే కారణంతో సీతంరాజు సుధాకర్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించి కూటమి అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు.టీడీపీ పోటీ చేసిన వార్డుల్లో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సహకరించారని, కానీ జనసేన, బీజేపీ పోటీ చేసిన వార్డుల్లో ఇండిపెండెంట్లకు సహకరించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. దీనిపై కూటమి నాయకత్వం స్పందించాలని కోరారు.టర్‌గా ఐదేళ్లు సేవలందించానని, ఈసారి మహిళా రిజర్వేషన్‌ కారణంగా తన సతీమణిని బరిలో నిలిపానన్నారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Candidate DamodarYadavMohammadSadiqJanaSena39thWardDharna

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు