08/11/2026, Sunday · 03:08:41 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి షాక్.. బినామీ ఆస్తుల అటాచ్

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 11:45 AM హైదరాబాద్ 8

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి షాక్.. బినామీ ఆస్తుల అటాచ్
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్‌, నవంబర్ 6: నగరంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందినవిగా భావిస్తున్న బినామీ ఆస్తులపై కీలక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు రూ.59.4 లక్షల విలువైన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని ముత్తంగి బృందావన్ గార్డెన్స్‌లో 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు ఇళ్లను గుర్తించి జప్తు చేశారు. రికార్డుల్లో ఒక్కో ఇంటి విలువ రూ.14.2 లక్షలుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇళ్లను జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి.కల్యాణ్ బాబు 2023 జూలైలో ఇంద్రకిరణ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఐటీ విచారణలో వెల్లడైంది. అనంతరం ఎలాంటి నగదు చెల్లింపులు జరగకుండానే ఇళ్లను ఇంద్రకిరణ్ పేరుతో బదిలీ చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఇంద్రకిరణ్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ ఆస్తుల వెనుక అసలు లబ్ధిదారుడు డీఎస్పీ భీమ్ రెడ్డేనని అధికారులు గుర్తించినట్లు సమాచారం.

ఇదీ చదవండి :: కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు.

Reddy ShockedDSPBhimIllegalAssetsCaseAttachmentBenami

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు