08/11/2026, Sunday · 03:19:07 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జిల్లాలో సుగంధ, ఔషధ మొక్కల పెంపునకు పెద్దపీట

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 9:02 PM శ్రీ సత్యసాయి 16

జిల్లాలో సుగంధ, ఔషధ మొక్కల పెంపునకు పెద్దపీట
Want this news as a newspaper clip?Print News Clip
  • 1,500 హెక్టార్లలో మెడిసినల్ & అరోమాటిక్ ప్లాంట్స్ సాగు లక్ష్యం
  • రెండు రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్

శ్రీసత్యసాయి జిల్లాలో అరోమాటిక్ మరియు మెడిసినల్ ప్లాంట్స్ (సుగంధ, ఔషధ మొక్కలు) సాగును విస్తృతంగా పెంచేందుకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ సీఈవో చంద్రశేఖర్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు.భారత ప్రభుత్వం సహాయ సహకారాలతో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు 1300 నుండి 1500 హెక్టార్లలో మొక్కలు పెంపకం చేపట్టాలని నిర్ణయించారు.
 విభాగాల వారీగా కేటాయించిన లక్ష్యాలు:
ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ : 200 హెక్టార్లు
సోషల్ ఫారెస్ట్రీ: 200 హెక్టార్లు
హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ : 200 హెక్టార్లు
అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్: 200 హెక్టార్లు
సెరికల్చర్ డిపార్ట్‌మెంట్: 50 హెక్టార్లు
డ్వామా: 600 హెక్టార్లు
 జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...
ఆసక్తిగల రైతులను మరియు అనువైన భూములను వెంటనే గుర్తించాలి. ఫారెస్ట్ ఏరియాలకు ఆనుకుని ఉన్న భూములను ఈ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కేటాయించిన టార్గెట్‌కు సంబంధించి రెండు రోజుల్లోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఎఫ్‌వో చక్రపాణి, సోషల్ ఫారెస్ట్రీ డీఎఫ్‌వో శ్రీనివాసులు, ఉద్యానవన శాఖ అధికారి జయకుమార్, వ్యవసాయం డిఎఓ కృష్ణయ్య,డ్వామా పీడీ విజయ ప్రసాద్, సెరికల్చర్ జెడి శోభా రాణి,అధికారులు మరియు మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు సీఈవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: 60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!

జిల్లాలో సుగంధ, ఔషధ మొక్కల పెంపునకు పెద్దపీట

medicinal plantsPeddapetacultivationaromaticdistrict

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు