08/11/2026, Sunday · 03:08:43 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 5:46 PM రాష్ట్ర వార్తలు 12

పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి
Want this news as a newspaper clip?Print News Clip
  • వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను తానుగా వదలివెళ్లలేదని, ఆ పార్టీ నుంచి తనను బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను తానుగా వదలివెళ్లలేదని, ఆ పార్టీ నుంచి తనను బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు  తాడేపల్లిలో మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా పొమ్మనకుండా పొగబెట్టి, పదే పదే అవమానించడం వల్లే తాను బయటకు రావాల్సి వచ్చిందని తెలిపారు. సుమారు 70కు పైగా ఆయా ఘటనల్లో తనను అవమానించారని, ఇక భరించలేనటువంటి పరిస్థితుల్లోనే వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.
వైఎస్ ఏనాడూ అవమానించలేదు..
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కానీ, ఆయన తండ్రి రాజారెడ్డి కానీ తనను ఏనాడూ అవమానించలేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం జగన్ రెడ్డి పాలనలోనే, ఇతరులు చెప్పే మాటలు విని తనను అవమానించారని అన్నారు. జగన్ కూడా అప్పుడప్పుడు తనను అవమానించారని చెప్పారు. ఎవరూ ఇన్ని అవమానాలు భరించకూడదన్నారు. స్థానిక ఎన్నికల్లో గుంటూరు, ప్రకాశం, అనంతపురం సహా రాయలసీమ జిల్లాల్లో జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని చెప్పుకొచ్చారు.
నా పార్టీలో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం..
అలాగే, నూతన పార్టీ ఏర్పాట్లపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 11వ తేదీన తమ పార్టీ ఆవిర్భావానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అన్నివర్గాలకు చెందిన నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా తాను పెట్టబోయే పార్టీలో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఉంటుందని, అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు. కొత్త పార్టీని పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీలో మరో ఇద్దరు నేతలు చేరారని ప్రకటించారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు సుమతిరెడ్డి, దళిత సంఘాల నేత బోణి గణేశ్ తమ పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని రెండు కుటుంబాల చేతుల్లోనే పెట్టకూడదని అన్నారు. తమ పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మాటిచ్చారు. నిరంకుశత్వ పాలన చేయకుండా తమ పార్టీ విధానం ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో చాలామంది తమ పార్టీలోకి రాబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదగబోతుందని విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :: కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు.

Vijayasai ReddyComingoutYSRCPrepeatedinsult

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు