08/11/2026, Sunday · 04:00:40 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడమే జగన్ అజెండా: ఎమ్మెల్యే బొండా ఉమా

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 4:03 PM రాష్ట్ర వార్తలు 8

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడమే జగన్ అజెండా: ఎమ్మెల్యే బొండా ఉమా
Want this news as a newspaper clip?Print News Clip

 స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్ రావు ఆరోపించారు. అందుకే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, నగరిలో రోజా అరాచకాలు సృష్టించారన్నారు. ఎన్నికలను అడ్డుకోవడానికే గొడ్డలి పార్టీ 59 కేసులు పెట్టిందని నిందించారు. నంద్యాలలో కౌన్సిలర్ అభ్యర్థిగా నాగమణి సంతకాలు పెట్టి విత్‌డ్రా చేసుకుంటే దానిని వక్రీకరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.2014 మున్సిపల్ ఎన్నికల్లో కేవలం1 శాతం మాత్రమే ఏకగ్రీవాలు జరిగితే.. 2021లో జగన్ దౌర్జన్యాలు చేసి 21 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. సొంత బాబాయిని చంపి రక్తచరిత్రను రాయించిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని ధ్వజమెత్తారు. వైసీపీకి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ కూడా గల్లంతవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలను ఎగ్గొట్టిన జగన్ పార్టీ.. 2029 ఎన్నికల్లో భూస్థాపితం అవుతుందని ఎమ్మెల్యే బొండా పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Bonda UmaJaganagendathwartlocalelectionsMLA

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు