08/11/2026, Sunday · 03:18:06 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అదే విషం.. పదే పదే

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 10:47 AM గుంటూరు 10

అదే విషం.. పదే పదే
Want this news as a newspaper clip?Print News Clip
  • అమరావతిపై మళ్లీ వైసీపీ దుష్ప్రచారం

గుంటూరు : వర్షం వస్తే కప్పలు బెక బెక మన్నట్లు, వైసీపీ కూడా అమరావతిపై కారుకూతలు కూయడానికి సిద్ధమవుతుందని రాజధాని ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. అర్నబ్‌, మురసు తుఫాన్‌లతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయని, కానీ అమరావతిలో ఎక్కడా నిలిచిలేదని చెప్పారు. రాజధాని పనులు చేస్తున్న ప్రదేశంలో వర్షపు నీరు నిలబడితే అమరావతిని వరద చుట్టుముట్టిందని జగన్‌ రోతపత్రిక విషపు రాతలు రాస్తోందని, వైసీపీ మూకలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిపై విష ప్రచారం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనా ఆ పార్టీ వాళ్లకి బుద్ధి రాలేదని, స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవం మూటకట్టుకున్నా కూడా తెలుసుకోవటం లేదన్నారు. అమరావతి మీద పదేపదే విషం చిమ్మితే జగన్‌ పార్టీ జీరో సీట్లకే పరిమితంకావడం ఖాయమన్నారు.

పనులు చేసే ప్రదేశంలో నీరు నిలవదా?

రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నా జగన్‌ బ్యాచ్‌ విషం చిమ్ముతోంది. రోడ్లు వేసేటప్పుడు, కేబుల్‌ డెక్‌లు కట్టేటప్పుడు భూమిని తవ్వాల్సి వస్తుంది. అక్కడ వర్షపు నీరు నిలబడితే అమరావతిని వరద చుట్టముట్టిందని, దారేదని అసత్య ప్రచారాలు నీలి, కూలి మీడియాలో చేయటం హేయమైన చర్య.

చెక్కు చెదరని అమరావతి

రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన రెండు అతిపెద్ద తుఫానుల తరువాత కూడా రాజధాని పనులు సాఫీగా సాగుతున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో స్పష్టమైంది. గురువారం రాజధాని అమరావతిలో ఉన్న పరిస్థితిని సజీవ సాక్ష్యాధారాలతో ప్రజల ముందుకు తెచ్చింది. అమరావతి మునిగిపోయిందంటూ విషం ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టమైంది. ఐకానిక్‌ టవర్ల వద్ద చుక్క నీరు నిలవలేదు. కార్యదర్శుల భవనాల వద్ద, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద, జడ్జిల విల్లాల వద్ద, ఎక్కాడా వర్షపు నీటి జాడ లేదు. నేలపాడులోని హైకోర్టులో కార్యకలాపాలు బుధ, గురువారాల్లో యథావిధిగా జరిగాయి.

ఇదీ చదవండి :: 60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!

Same poison

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు