08/11/2026, Sunday · 04:14:32 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

9 టు 5 ఉద్యోగం చేయలేక ఆరుసార్లు కెరీర్ మార్చుకుంది.. రాజస్థాన్ మహిళ కథ వైరల్..

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 1:42 PM జాతీయం 6

9 టు 5 ఉద్యోగం చేయలేక ఆరుసార్లు కెరీర్ మార్చుకుంది.. రాజస్థాన్ మహిళ కథ వైరల్..
Want this news as a newspaper clip?Print News Clip
  • (Rajasthan Woman Viral Story).

జీవితంలో స్థిరపడాలంటే మంచి ఉద్యోగం, నెలనెలా జీతం, పెళ్లి, కుటుంబం.. ఇవే అవసరమని చాలామంది భావిస్తారు. కానీ కొందరు మాత్రం తమకు నచ్చిన విధంగా జీవించేందుకు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటారు. తనకు నచ్చిన ఉద్యోగం మాత్రమే చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన 30 ఏళ్ల హిమానీ మిట్టల్ (Himani Mittal) కూడా అలాంటి వారిలో ఒకరు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఉద్యోగం చేయడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఆమె ఇప్పటివరకు ఆరు సార్లు కెరీర్ మార్చుకుని తనకు నచ్చిన రీతిలో నడుస్తోంది.రాజస్థాన్‌లోని అబూ రోడ్‌కు చెందిన హిమానీ మిట్టల్ చిన్న వయసులోనే ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం ఎంత ముఖ్యమో గుర్తించారు. ఈ లక్ష్యంతోనే 21 ఏళ్ల వయసులో స్పానిష్ భాష బోధించడం ప్రారంభించారు. అప్పటికి ఆమె ఆ భాషను నేర్చుకుంటున్నప్పటికీ, బోధన ద్వారా ఆదాయం సంపాదించే ప్రయత్నం చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆమె వయసు 23 ఏళ్లు. ఆ సమయంలో తన పనిని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చుకున్నారు. దీంతో ఇంటి నుంచే పని చేస్తూ కొత్త అవకాశాలను అన్వేషించే వీలు కలిగింది. చిత్ర నిర్మాణంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత 25 ఏళ్ల వయసులో హిమానీ స్పెయిన్‌కు వెళ్లారు (Rajasthan Woman Viral Story).

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

rajasthan mahilaudyogamcheyalekaarusarlukerirmarchukumdi

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు