08/11/2026, Sunday · 04:14:30 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

చరిత్ర సృష్టించిన భువనేశ్వర్.. సౌథీ రికార్డు బద్దలు

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 3:21 PM జాతీయం 7

చరిత్ర సృష్టించిన భువనేశ్వర్.. సౌథీ రికార్డు బద్దలు
Want this news as a newspaper clip?Print News Clip

న్యూజిలాండ్, భారత్ మధ్య ఇవాళ్టి నుంచి టీ20 సిరీస్ ప్రారంభమైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. నాలుగేళ్ల విరామం తర్వాత టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. ఈ క్రమంలోనే భువీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పవర్‌ప్లేలో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ టిమ్‌ సౌథీ రికార్డును భువీ బ్రేక్ చేశాడు.క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ కేవలం నాలుగు పరుగులే ఇచ్చి మూడు డాట్‌ బాల్స్‌ వేశాడు. దీంతో పూర్తి సభ్య దేశాల బౌలర్లలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల పవర్‌ప్లేలో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి..98 పరుగులు చేసింది. మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ తీశారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

breaks recordBhubaneswarcreateshistorySouthee

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు