08/11/2026, Sunday · 03:08:43 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

దీపావళి పండుగ ఎఫెక్ట్‌.. సొంతూళ్లకు 2 లక్షల మంది పయనం

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 10:56 AM జాతీయం 6

దీపావళి పండుగ ఎఫెక్ట్‌.. సొంతూళ్లకు 2 లక్షల మంది పయనం
Want this news as a newspaper clip?Print News Clip
  • కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
  • విమాన చార్జీలకు రెక్కలు

చెన్నై: దీపావళి పండుగను సొంతూర్లలో జరుపుకునేందుకు నగర వాసులు తరలివెళ్ళారు. గురువారం ఒక్కరోజే ఏకంగా రెండు లక్షల మంది ఊర్లకు వెళ్ళారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, రైళ్ళు, విమానాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దీపావళి రద్దీని క్యాష్‌ చేసుకునేందుకు విమానయాన సంస్థలు చార్జీలను ఏకంగా నాలుగు రెట్లు పెంచేశాయి.

దీపావళి పండుగకు సొంతూర్లకు వెళ్ళే వారి కోసం రాష్ట్ర రవాణా సంస్థ రెగ్యులర్‌ సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. చెన్నై నగరం నుంచి వివిధ జిల్లాలకు సాధారణ రోజుల్లో నడిపే 2191రెగ్యులర్‌ బస్సులతో పాటు 2870 ప్రత్యేక బస్సులను నడిపేలా ప్లాన్‌ చేశారు. గురువారం రెగ్యులర్‌ సర్వీసులతో పాటు 1018 ప్రత్యేక బస్సులు కలిపి మొత్తం 3209 బస్సులను నడిపారు. ఈ బస్సుల్లో గురువారం ఒక్కరోజే ఏకంగా 1.40 లక్షల మంది ప్రయాణించారు.

ఇదిలావుండగా విమాన ప్రయాణ చార్జీలను నాలుగు రెట్లు అధికంగా వసూలు చేశారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమన్నారు. మరోవైపు, ప్రయాణికులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా రవాణా శాఖామంత్రి విజయ్‌ తమిళన్‌ పార్తిబన్‌ కీలాంబాక్కం బస్టాండు నుంచి స్వయంగా పర్యవేక్షించారు. అలాగే, మరైమలర్‌ నగర్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. ముఖ్యంగా రవాణా సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల సమీపానికి బస్సులు వెళ్ళేలా తొమ్మిది సర్వీసులను నడిపారు.

ఇదీ చదవండి :: కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు.

Festival EffectDiwalilakhpeopletravelhometowns

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు