10/11/2026, Tuesday · 12:49:30 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

వందేళ్ల ప్రస్థానంలో స్వార్థం లేని 'స్వయంసేవకులే' ఆర్‌ఎస్‌ఎస్‌కు గుర్తింపు: మోహన్ భాగవత్

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 2:09 PM జాతీయం 5

వందేళ్ల ప్రస్థానంలో స్వార్థం లేని 'స్వయంసేవకులే' ఆర్‌ఎస్‌ఎస్‌కు గుర్తింపు: మోహన్ భాగవత్
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్ : వందేళ్ల ప్రస్థానంలో స్వార్థం లేని 'స్వయంసేవకులే' ఆర్‌ఎస్‌ఎస్‌కు అసలైన గుర్తింపు అని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్ భాగవత్ (Mohan Bhagwat) వ్యాఖ్యానించారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసమే పనిచేసేవారే ప్రచారకులని పేర్కొన్నారు. ఈరోజు  నాగ్‌పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ నూతన ఆడిటోరియాన్ని మోహన్ భగవత్ ప్రారంభించి, ప్రసంగించారు.

ప్రావిన్స్ అసెంబ్లీలో ఇబ్రహీం వాదించారు..

1930లలో ఆర్‌ఎస్‌ఎస్‌పై తొలి నిషేధ యత్నం నాటి ఆసక్తికర ఘట్టాన్ని ఈ సందర్భంగా మోహన్ భగవత్ గుర్తుచేశారు. నాటి రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్థించే స్వయంసేవకులు, భావజాల మద్దతుదారులు గానీ సెంట్రల్ ప్రావిన్స్ అసెంబ్లీలో లేరని చెప్పుకొచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై తొలి నిషేధయత్నం జరిగినప్పుడు సభలో మద్దతు తెలిపిన ఏకైక వ్యక్తి ఇబ్రహీం అని ప్రస్తావించారు. ఆర్‌ఎస్‌ఎస్ మతతత్వ సంస్థ కాదని, నిషేధించవద్దని నాటి సెంట్రల్ ప్రావిన్స్ అసెంబ్లీలో ఇబ్రహీం వాదించారని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

selfless volunteersRecognitionRSSyearsMohanBhagwat

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News