10/11/2026, Tuesday · 12:49:35 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జన్యుశాస్త్ర పరిశోధనల్లో ఖురానా చెరగని ముద్ర

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 3:51 PM హైదరాబాద్ 6

జన్యుశాస్త్ర పరిశోధనల్లో ఖురానా చెరగని ముద్ర
Want this news as a newspaper clip?Print News Clip
  • శాస్త్రవేత్త హర గోవింద్ ఖురానా సేవలు చిరస్మరణీయం
  • జన్యుశాస్త్ర పరిశోధనలతో ప్రపంచ విజ్ఞానానికి విశేష సేవలు

కమలా నగర్: ప్రముఖ భారత సంతతి శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత హర గోవింద్ ఖురానా 15వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలా నగర్‌లోని సీఐటీయూ కార్యాలయ ప్రాంగణంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రజాతంత్ర ఉద్యమ కార్యదర్శి పి. సత్యం, మల్కాజిగిరి మాజీ కౌన్సిలర్ చల్లా లీలావతి ఖురానా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్ఫూర్తి గ్రూప్ నాయకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. జన్యుశాస్త్ర రంగంలో హర గోవింద్ ఖురానా చేసిన పరిశోధనలు ప్రపంచ శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయని తెలిపారు. డీఎన్ఏ, ఆర్ఎన్ఏలోని జన్యు సమాచారాన్ని అర్థం చేసుకునే దిశగా ఆయన పరిశోధనలు కీలక పురోగతికి మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. జీవశాస్త్ర రంగంలో ఆయన పరిశోధనలు విప్లవాత్మక మార్పులకు పునాది వేశాయని అన్నారు. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ.. ఖురానా పరిశోధనలు మానవాళి ఆరోగ్యం, జీవశాస్త్ర రంగాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. వివిధ వ్యాధులపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు వాటి నివారణకు అవసరమైన శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి చెందడంలో ఆయన పరిశోధనలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఆయన చేసిన సేవలు భావితరాల శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మల్కాజిగిరి మాజీ కౌన్సిలర్ చల్లా లీలావతి మాట్లాడుతూ.. హర గోవింద్ ఖురానా వంటి మహనీయ శాస్త్రవేత్తల సేవలను స్మరించుకోవడం ద్వారా యువతలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని, పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఖురానా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, జె. చంద్రశేఖర్, ఎన్. శ్రీనివాస్, కృష్ణమాచార్యులు, ఉమామహేశ్వరరావు, జి. శ్రీనివాసులు, రుక్కయ్య, ఉదయ భాస్కర్, శివ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: జార్ఖండ్ రాష్ట్రం, సరాయికేలా ఖర్సావన్ జిల్లాలోని గమ్హరియా పోలీస్ స్టేషన్‌లో దారుణ ఘటన

inexhaustible imprintQurgeneticresearch

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News