10/11/2026, Tuesday · 12:49:27 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ముస్లిం రైతు ఇచ్చిన పాలు తాగిన అస్సాం సీఎం

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 4:43 PM జాతీయం 2

ముస్లిం రైతు ఇచ్చిన పాలు తాగిన అస్సాం సీఎం
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక ముస్లిం రైతు ఇచ్చిన పాలను వేదికపైనే తాగారు. ఈనెల 7న నాగావ్‌ జిల్లా సమాగురిలో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. తన సొంత డెయిరీ ఫామ్‌లో ఉత్పత్తి చేసిన పాలను ముహమ్మద్‌ సోహబ్‌ అలీ అనే రైతు.. ముఖ్యమంత్రి హిమంతకు అందజేశారు. ‘అవి ఆవు పాలా? గేదె పాలా?’ అని హిమంత అడగ్గా.. ఆవు పాలని రైతు సమాధానమిచ్చాడు. దీంతో హిమంత ఆ బాటిల్‌ నుంచి కొంత పాలు తాగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. సోహబ్‌ అలీ ఇచ్చిన బహుమతిని 'డెయిరీ లిషియస్‌ గిఫ్ట్‌' గా అభివర్ణించారు. పాడి రైతులు లాభదాయకంగా వ్యాపారం నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. అస్సాంలో రోజువారీ పాల ఉత్పత్తిని 10 లక్షల లీటర్లకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.కాగా.. ఎన్‌డీఏ అభ్యర్థి దేవాశిష్‌ శర్మ.. నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే రూపాహిహాట్‌ ప్రాంతాన్ని సందర్శించి స్థానికులతో కలిసి వేడుకలు జరుపుకొంటానని ఎన్నికల ప్రచారం సమయంలో హిమంత హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ పర్యటించి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న నాగావ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు పాడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

milk givenAssamdrinksMuslimfarmer

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News

ఇక జిల్లాల్లోనే మెరుగైన వైద్యం.. 1,616 మంది స్పెషలిస్ట్‌ల నియామకం: మంత్రి దామోదర మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి.. వ్యాపారి అరెస్ట్ ప్రజల తీర్పే కూటమికి కొండంత బలం నర్సాపురం అల్లుడికి ఘన స్వాగతం.. అత్యంత అద్భుతమైన త్రేతాయుగం నాటి పుష్పగిరి క్షేత్రం పదవీ విరమణ చేసిన వ్యక్తిని మళ్లీ ఉద్యోగంలోనే చంపేశారు! మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.. అగ్రికల్చర్ వర్సిటీ వీసీకి మహిళా కమిషన్ నోటీసులు జన్యుశాస్త్ర పరిశోధనల్లో ఖురానా చెరగని ముద్ర