08/11/2026, Sunday · 03:18:54 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మేము కూటమిలో ఉన్నామా లేదా

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 11:00 AM వైఎస్సార్ కడప 8

మేము కూటమిలో ఉన్నామా లేదా
Want this news as a newspaper clip?Print News Clip

ప్రొద్దుటూరు రూరల్‌ : కూటమిలో జనసేన భాగస్వామిగా ఉందా లేదా? పవన్‌కళ్యాణ్‌ను టీడీపీ నాయకులు తమ నేతగా భావిస్తున్నారా? అని జనసేన నాయకుడు మంచి శివకుమార్‌ ప్రశించారు. తాళ్లమాపురం ఎంపీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించి, బీరం మౌనికను అధికారిక అభ్యర్థిగా నిలబెడితే.. టీడీపీ నాయకులు మాత్రం స్వతంత్ర అభ్యర్థి సిగినేని సుబ్బమ్మకు పసుపు కండువాలు వేసి మరీ ప్రచారం చేయడం దారుణమన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయానికి జనసేన సైనికులు కష్టపడి 230 ఓట్ల మెజారిటీ తెచ్చారని గుర్తుచేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ గ్రామానికి రూ.3.50 కోట్లు కేటాయించారని, దానికి కృతజ్ఞతగా ఈ సీటు గెలవాలని తాము భావిస్తే.. టీడీపీ నాయకులు మూలవారిపల్లెలో కొత్త వ్యక్తులతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. జనసేన బూత్‌ ఏజెంట్‌ను పోలీసులు బయటకు పంపారని, మహిళా ఓటర్లను అధికారులు బెదిరించారని మండిపడ్డారు. దీనిపై పోలీసు అధికారులకు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూలవారిపల్లె బూత్‌లో రీపోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేస్తూ, ఈ అక్రమాలను పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తామని శివకుమార్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: 60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!

Whethermeeting

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు