10/11/2026, Tuesday · 12:49:31 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 1:12 PM జాతీయం 6

ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు
Want this news as a newspaper clip?Print News Clip

ఢిల్లీ : ప్రైవేట్ రంగంలో పనిచేసే పురుషులకు కూడా వేతనంతో కూడిన పెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ రహాత్కర్ (NCW) సిఫార్సులు చేశారు. పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వానికి 37 కీలక సిఫార్సులను చేశారు. ‘పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు ఉద్యోగానికి గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం రాకూడదు. సమాన బాధ్యత తీసుకుంటేనే ఇది సాధ్యం’ అని విజయ రహాత్కర్ పేర్కొన్నారు.ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తండ్రులకు కూడా వేతనంతో కూడిన పెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని విజయ రహాత్కర్ సూచించారు. ప్రసూతి ప్రయోజనాలు, చైల్డ్‌కేర్ మౌలిక వసతులు, కార్యాలయాల్లో వివక్ష నివారణ వంటి 9 కీలక విభాగాలపై పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ, కార్మిక, WCD మంత్రిత్వ శాఖలకు విజయ రహాత్కర్ నివేదిక సమర్పించారు. భాగస్వామ్య వర్గాలతో విస్తృత సంప్రదింపుల తర్వాతే ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు స్పష్టం చేశారు. తల్లి అన్న కారణంగా మహిళల కెరీర్‌కు ఆటంకం కలగవద్దని అన్నారు. పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి సమాన బాధ్యత అని విజయ రహాత్కర్ ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి :: నేడు ధన త్రయోదశి

Paternity LeavePrivateEmployeesNationalCommissionWomenRecommendationsCentre

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News