నర్సాపురం అల్లుడికి ఘన స్వాగతం..

- వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఘన సన్మానం
- మేయర్‌గా విజయం సాధించడం జనసేన పార్టీకి గర్వకారణం
నర్సాపురం: విజయవాడ మేయర్‌గా జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన వంగవీటి రాధాకృష్ణకు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. వంగవీటి రాధాకృష్ణ నర్సాపురం పర్యటన సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుంచి విజయం సాధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు జక్కం బాబ్జీ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్‌గా విజయం సాధించిన రాధాకృష్ణకు పుష్పగుచ్ఛాలు అందించి, పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. నర్సాపురం అల్లుడిగా విజయవాడ మేయర్ పదవిని చేపట్టడం తమకు ఎంతో ఆనందంగా ఉందని జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాధాకృష్ణకు అభినందనలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీలో చేరడం తమకు ఎంతో బలాన్ని, నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ విజయం సాధించడం పార్టీకి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు బలమైన సైనికుడిగా అండగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన జడ్పీటీసీ అడ్డాల శ్రీ సత్య శ్రీనివాస్, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే నాయకర్ మేయర్ రాధాకృష్ణకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు వర్ధనపు ప్రసాద్, నిప్పులేటి తారక రామారావు, పోలిశెట్టి నళిని, పోలిశెట్టి సాంబ, వలవల కుమార్, ఘంటా కృష్ణ, భీమల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల












