10/11/2026, Tuesday · 12:49:35 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తూర్పుగోదావరి జిల్లా పొగాకు బ్యారెన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.10 లక్షల నష్టం

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 1:09 PM తూర్పు గోదావరి 5

తూర్పుగోదావరి జిల్లా పొగాకు బ్యారెన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.10 లక్షల నష్టం
Want this news as a newspaper clip?Print News Clip

తూర్పుగోదావరి జిల్లా : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో పొగాకు బ్యారెన్‌ దగ్ధమైంది. ఈ ఘటనలో పోతవరం గ్రామానికి చెందిన గద్దె తాతారావుకు చెందిన పొగాకు బేళ్లు కాలిపోయాయి. మురసు తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు తాతారావు పొగాకు బేళ్లు తడిసి ముద్దయ్యాయి.తడిసిపోయిన పొగాకులో ఉన్న చెమ్మను తొలగించేందుకు మళ్లీ బ్యారెన్‌లో పెట్టి క్యూరింగ్ చేస్తుండగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల విలువైన పొగాకు బేళ్లు కాలిపోయాయి. సమాచారం అందగానే తాడేపల్లిగూడెం అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఫైర్ సిబ్బంది చర్యలతో మంటలు అదుపులోకి వచ్చాయి.

ఇదీ చదవండి :: ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు

Rs10 lakhMassivefirebreaksouttobaccobarrenEast

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News