10/11/2026, Tuesday · 12:49:23 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

భారత్ భారీ స్కోరుకు వర్షం అడ్డంకి.. మూడో రోజు ఆట రద్దు!

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 2:12 PM క్రీడలు 4

భారత్ భారీ స్కోరుకు వర్షం అడ్డంకి.. మూడో రోజు ఆట రద్దు!
Want this news as a newspaper clip?Print News Clip

స్పోర్ట్స్ డెస్క్: లిన్‌కోన్‌ వేదికగా న్యూజిలాండ్-ఏ, భారత్-ఏ జట్ల మధ్య మూడో అనధికారిక టెస్టు జరుగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ టెస్ట్.. మూడో రోజు ఆట ఒక్క బంతి కూడానే రద్దైంది. దీంతో అతిథ్య కివీస్ జట్టుకు భారీ ఊరట లభించినట్లైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 464 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం న్యూజిలాండ్-ఏ తమ తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌-ఏ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో యశ​స్వి జైస్వాల్ (102) సెంచరీతో రాణించగా.. సాయి సుదర్శన్‌ అర్ధ శతకం (88)తో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ (15) విఫలమైనా.. కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ (71), తిలక్‌ వర్మ (81 నాటౌట్‌)లు కూడా హాఫ్ సెంచరీతో రాణించారు. రవీంద్ర జడేజా 25 పరుగులు చేయగా.. వాషింగ్టన్‌ సుందర్‌ అర్ధ శతకం (50)తో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఐదు వికెట్ల నష్టానికి 464 పరుగుల భారీ స్కోరు వద్ద భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాక్‌ గిబ్సన్‌ 2 వికెట్లు తీయగా.. జారోడ్‌ మెకాయ్‌, కామెరాన్‌ పాల్‌, డనురు ఫెర్న్స్‌ తలో ఒక వికెట్‌ పడగొట్టారు.

అనంతరం న్యూజిలాండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగా.. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన భారత పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ కివీస్‌కు చుక్కలు చూపించాడు. ఓపెనర్లు రైస్‌ను డకౌట్‌ చేసిన ప్రసిద్‌.. కర్టిస్‌ హీపీని 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్‌ 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ భారత్‌ కంటే 428 పరుగుల వెనుకబడి ఉంది. అయితే, మూడో రోజు ఆటకు పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. వాన ఎంతకూ ఆగకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మూడో రోజు ఆటను ముగిసిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

halts IndiaRainthirddayplay

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News