10/11/2026, Tuesday · 12:48:37 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అత్యంత అద్భుతమైన త్రేతాయుగం నాటి పుష్పగిరి క్షేత్రం

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 4:08 PM రాష్ట్ర వార్తలు 4

అత్యంత అద్భుతమైన త్రేతాయుగం నాటి పుష్పగిరి క్షేత్రం
Want this news as a newspaper clip?Print News Clip

ఇక్కడ చూస్తున్నారు కదా... అత్యంత అద్భుతమైన త్రేతాయుగం నాటి పుష్పగిరి క్షేత్రం. పుష్పగిరిని 'దక్షిణ కాశీ' అని కూడా పిలుస్తారు. వైష్ణవులు 'మధ్య అహోబిలం' అని, శైవులు 'మధ్య కైలాసం' అని పిలుస్తారు. పెన్నా నదిలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు కలవడం వల్ల ఇది పంచనదీ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

మనం పురాణాల్లో వింటూ ఉంటాం కదా... పూర్వం మునులు, ఋషులు నదికి వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరించే వారని, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేవారని! కానీ, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో, అందునా మన కడప జిల్లాలో ఉన్న ఇలాంటి దివ్యమైన క్షేత్రాలను చూస్తే... ఆధ్యాత్మికంగా జీవితం గడపాలనుకునే ఎవరైనా సరే, ఇక్కడే స్థిరపడిపోవాలని కోరుకుంటారు. అక్కడ ప్రవహించే పవిత్ర నదిలో స్నానం చేస్తూ, అక్కడే కొలువుదీరిన వైద్యనాథేశ్వర స్వామి వారిని మరియు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకుంటూ ఆ పరమాత్మ మదిలో తరించాలనిపిస్తుంది.

అలాంటి అత్యంత అద్భుతమైన క్షేత్రం మన సొంతం కావడం మన అదృష్టం. కానీ, మన దౌర్భాగ్యం ఏమిటంటే... ఈ పుష్పగిరి చుట్టూ అద్భుతంగా గిరిప్రదక్షిణ చేసే అవకాశం ఉన్నా, మనం మాత్రం ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రదక్షిణలు చేస్తుంటాం! అది ఎవరి ఇష్టం వాళ్లది అనుకోండి, ఆ విషయాన్ని పక్కన పెడితే... ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో ఉండాల్సిన ఇక్కడి పీఠాధిపతులు మాత్రం, ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి పుణ్యక్షేత్రాల దగ్గర ఉండరు; ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటుంటారు! అది మరింత బాధ కలిగించే విషయం.

ఇక ఇది దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండేదే కదా! మనకు తెలిసిందేగా... మన దేశంలో అంతా నిజాయితీగా పనిచేసే శాఖ ఏదైనా ఉందంటే అది మన 'దేవాదాయ శాఖ' మాత్రమే! ఎంత నిజాయితీ అంటే, సరిగ్గా గొర్రెల కాపలాకు తోడేళ్లను పెట్టినట్టు ఉంటుంది దాని వ్యవహారం!

ఏది ఏమైనా, వీలైన వారు కచ్చితంగా ఇలాంటి క్షేత్రాలకి వెళ్ళండి; అక్కడ మన దైవాన్ని దర్శించుకోండి.

మన తెలుగు ప్రజలకు ఒక పిచ్చి ఉందన్నమాట! ఎక్కడో మొహానికి రంగులు వేసుకుని, బతుకు కోసం యాక్టింగ్ చేసే సినిమా వాళ్లను హీరోలు అనుకుంటూ ఉంటాం. అలాంటి వారు ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక ఫోటో దిగితే చాలు... "అబ్బా, ఫలానా హీరో అక్కడ విజిట్ చేశాడట, ఆ ప్రాంతం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత మహిమ ఉంటుందో!" అని చెప్పి, ఆ తర్వాత తండోపతండాలుగా పరుగులు పెడతాం. అలాంటి పిచ్చి అలవాట్లు ఇప్పటికైనా పక్కన పెడదాం!

ఇక్కడికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు రాకపోవచ్చు; కానీ, పద్నాలుగు లోకాలను, అండపిండ బ్రహ్మాండాన్ని పాలించే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆ జగన్నాథుని దర్శనం కోసం రండి, ఆ మహాశక్తిని మనస్ఫూర్తిగా కోరుకోండి!

ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

Treta YugaPushpagirifieldspectacular

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News