08/11/2026, Sunday · 04:14:30 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మతం మారితే రిజర్వేషన్‌ హక్కు రాదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

భవ్య జర్నలిస్ట్ 15/10/2026 1:45 PM జాతీయం 6

మతం మారితే రిజర్వేషన్‌ హక్కు రాదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Want this news as a newspaper clip?Print News Clip
  • తమిళనాడు బీసీ ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత
  • గుర్తింపు పొందిన ముస్లిం సమాజాల్లో సభ్యత్వం మత మార్పిడితోనే రాదని స్పష్టీకరణ
  • మద్రాస్‌ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం

హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారినంత మాత్రాన తమిళనాడులో బీసీ ముస్లిం (బీసీఎం) రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. మతం మారినంత మాత్రాన గుర్తింపు పొందిన వెనుకబడిన ముస్లిం సమాజాల్లో సభ్యత్వం లభించదని పేర్కొంది.

2024 మార్చి 9న తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, బీసీ, ఎంబీసీ, డీనోటిఫైడ్‌ కమ్యూనిటీలు, ఎస్సీ వర్గాలకు చెందినవారు ఇస్లాంలోకి మారితే బీసీ ముస్లిం కేటగిరీలో కమ్యూనిటీ సర్టిఫికెట్లు ఇచ్చి రిజర్వేషన్‌ ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది. అయితే, ఈ ఉత్తర్వును మద్రాస్‌ హైకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. రాష్ట్రంలో గుర్తించిన ఏడు ముస్లిం సమాజాల్లో సభ్యత్వాన్ని కేవలం మత మార్పిడి ఆధారంగా నిర్ధారించలేమని తెలిపింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ వివాదం సమీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి పిటిషన్‌తో ప్రారంభమైంది. 2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన ఆయన, లబ్బాయి ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తిగా కమ్యూనిటీ సర్టిఫికెట్‌ కోరగా అధికారులు తిరస్కరించారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమిళనాడులో అన్సార్‌, డెక్కనీ ముస్లింలు, దుబేకులా, లబ్బాయిస్‌, మాపిళ్ల, షేక్‌, సయ్యద్‌ సమాజాలను బీసీ ముస్లిం కేటగిరీలో గుర్తించారు. మత మార్పిడితో మాత్రమే ఈ సమాజాల్లో సభ్యత్వం నిర్ధారించలేమన్న న్యాయస్థానాల అభిప్రాయంతో ఈ వివాదానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

right reservationdoesnotaccruereligionchangedSupremeCourt

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు