08/11/2026, Sunday · 04:00:40 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 11:13 AM రాష్ట్ర వార్తలు 7

తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క
Want this news as a newspaper clip?Print News Clip

రాష్ట్ర అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Telangana Deputy CM Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. హైదరాబాద్‌లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 36వ రైజింగ్ డే పరేడ్‌ను  నిర్వహించారు. అమీన్‌పూర్‌లోని టీజీ ఎస్పీఎఫ్ సెక్యూరిటీ అకాడమీలో ఈ వేడుకలు జరిగాయి. ఈ పరేడ్‌‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ‌టీజీఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, హోం ప్రిన్సిపాల్ సెక్రటరీ శిఖా గోయల్ హాజరయ్యారు. 36వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. టీజీ ఎస్పీఎఫ్ సిబ్బంది క్రమశిక్షణ, సేవాస్ఫూర్తిని ప్రత్యక్షంగా చూస్తున్నానని, సంతోషంగా ఉందని తెలిపారు.

కీలక సంస్థలకు ఎస్పీఎఫ్ ప్రత్యేక భద్రత కల్పించింది..

‘ప్రభుత్వం ప్రజల భద్రతపై బాధ్యతగా వ్యవహరిస్తోంది. 30 సంవత్సరాల విశిష్ఠ ప్రయాణంలో టీజీ ఎస్పీఎఫ్ పాత్ర వెలకట్టలేనిది. కీలక సంస్థలకు ప్రత్యేక భద్రతను ఎస్పీఎఫ్ కల్పించింది. సచివాలయం, శాసనసభ హైకోర్టు, నాగార్జునసాగర్, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద, కేంద్ర ప్రభుత్వ కీలక సంస్థల్లో సెక్యూరిటీగా ఉంది. మీ నినాదం ప్రగతికి రక్షణ.. భద్రత ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ప్రతి అంశంలో మౌలిక అవసరం భద్రత, ప్రజల భద్రతే అభివృద్ధికి పునాది. జైపూర్, యాదాద్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో భద్రత ఎస్పీఎఫ్‌దే.. మీ కృషి మరువలేనిది. విద్యుత్ కేంద్రాలతో వెలుగులు వస్తాయి... వెలుగులు కాపాడే బాధ్యత ఎస్పీఎఫ్‌దే. 35 సంవత్సరాల్లో భద్రతలో చాలా మార్పులు వచ్చాయి’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

భద్రత వ్యవస్థ బలాన్ని ఆయుధాలతో కొలువలేం..

‘ఎస్పీఎఫ్ అధికారులు ప్రజల భద్రతలో భాగంగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ప్రత్యేక కిట్స్‌తో ముందుకెళ్తున్నారు. అమీన్‌పూర్‌లో ప్రత్యేక శిక్షణ స్థలం ఉండటం విశేషం. భద్రత వ్యవస్థ బలాన్ని ఆయుధాలతో కొలువలేం.. క్రమశిక్షణ, వివేకం, నిజాయితీ, బాధ్యతతో కొలవాల్సిన అవసరం ఉంది. పండుగలు, అత్యవసర పరిస్థితుల్లో ఎస్పీఎఫ్ ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబాన్ని విడిచిపెట్టి సైతం మీరు విధుల్లో పాల్గొంటున్నారు. మీ బాధ్యతలు, బరువులను మోస్తున్న కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ప్రభుత్వం అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తోంది. వాటిని కాపాడే వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి.. లేకపోతే అభివృద్ధి నిలకడగా మారుతుంది. తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వాన్ని ఎస్పీఎఫ్ ద్వారా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మీ మీదే ఉంది’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Bhatti VikramarkaRoleSPFdevelopmentTelanganacrucial

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు