10/11/2026, Tuesday · 12:49:32 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఢిల్లీలో 3000 దాటిన ఏక్యూఐ.. ఆప్ సంచలన ఆరోపణలు

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 1:25 PM జాతీయం 4

ఢిల్లీలో 3000 దాటిన ఏక్యూఐ.. ఆప్ సంచలన ఆరోపణలు
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ గాలి నాణ్యతపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సంచలన ఆరోపణలు చేసింది. దీపావళి రోజు దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచీ (AQI) 3000 దాటిందని, కానీ అధికారంలో ఉన్న బీజేపీ తప్పుడు రీడింగ్ చూపిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన ఏక్యూఐ గణాంకాలు వాస్తవ కాలుష్య స్థాయిలను ప్రతిబింబించడం లేదని ఆయన విమర్శించారు. ఢిల్లీలో అధికారికంగా చెబుతున్నదానికంటే ఏక్యూఐ రీడింగ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.కాలుష్యానికి సంబంధించిన రీడింగ్‌లను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఏక్యూఐ మానిటరింగ్ స్టేషన్ల చుట్టూ నీళ్లు జల్లుతోందని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. పరిస్థితి తీవ్రతను అంగీకరించకుండా.. గాలి నాణ్యత సూచీ డేటాను ప్రభుత్వం తారుమారు చేస్తోందని ఆయన మండిపడ్డారు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్న వారి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా దీపావళి వేడుకల తర్వాత దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచీ 366కు చేరిందని ప్రభుత్వం అధికారిక నివేదిక విడుదల చేసింది. ఇది 'వెరీ పూర్' కేటగిరీ కిందకు వస్తుందని పేర్కొంది. మరోవైపు ఏక్యూఐ 3000 దాటిందని ఆప్ వాదిస్తోంది.

ఇదీ చదవండి :: ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు

AAP allegesAQIcrossesDelhi

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News