జిల్లా కోర్ట్/ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప న్యాయ విభాగము:

- “అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సేవలు – జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయధికారి శ్రీ జి. రామ గోపాల్”
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా గౌరవ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయధికారి శ్రీ జి. రామ గోపాల్ వారు మరియు గౌరవ ఎస్.బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప వారు అవగాహన/న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగినది.
న్యాయం ప్రతి ఒక్కరి హక్కు అని, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని కడప జిల్లా గౌరవ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ జి. రామ గోపాల్ పేర్కొన్నారు.
జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం, ఉచిత న్యాయ సహాయం అందించడం, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించడం ద్వారా సత్వర న్యాయం అందించడం న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
పేదలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయవాది సేవలు, న్యాయ సలహాలు, అవసరమైన న్యాయ సహాయం అందిస్తున్నట్లు వివరించారు. అలాగే లోక్ అదాలత్‌లు, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని, తద్వారా సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు.
ప్రజలందరూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు మరియు ఇతర సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, న్యాయం అందరికీ చేరువ కావాలనే లక్ష్యంతో సంస్థ నిరంతరం కృషి చేస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, ప్యానెల్ లాయర్స్, మీడియేటర్స్, పారా లీగల్ వాలంటీర్స్ కి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ర్యాలీ వివరాలు: జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా ప్రజల్లో న్యాయ సేవలపై అవగాహన కల్పించేందుకు కడపలో జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి కోటిరెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, రాజీవ్ మార్గ్, కలెక్టర్ సుబ్రహ్మణ్యం సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా తిరిగి జిల్లా కోర్టు ప్రాంగణం వరకు ర్యాలీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో కడప యూనిట్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, మీడియేటర్స్, కోర్ట్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్స్, లా కాలేజ్ విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొని ఉచిత న్యాయ సహాయం, న్యాయ హక్కులు, సత్వర న్యాయం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. న్యాయ సేవల కోసం 15100 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి :: ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు












