10/11/2026, Tuesday · 12:49:31 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కడప నగరం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం సాధించింది

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 2:18 PM వైఎస్సార్ కడప 3

కడప నగరం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం సాధించింది
Want this news as a newspaper clip?Print News Clip

రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎస్.బి. అంజాద్ భాష గారు, సీఈసీ సభ్యులు కే. సురేష్ బాబు గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు.

ఈ సందర్భంగా రిమాండ్‌లో ఉన్న పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పి, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, వారిని రిమాండ్‌కు తరలించడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని నాయకులు విమర్శించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.

కడప నగరంలో నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన రాళ్ల దాడి ఘటనలో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా నిలిచాయని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాషా గారు తీవ్రంగా విమర్శించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా కడప నగరంలో ఎన్నికలు జరిగాయని, పోలీసులే అధికార పార్టీకి రక్షణగా నిలిచి భౌతిక దాడులకు సహకరించారని ఆరోపించారు. పోలింగ్ రోజున కూడా టిడిపి గుండాలు మరియు పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లను అడ్డుకున్నారని, వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.

జరగని ఘటనలను జరిగినట్లుగా చూపిస్తూ 307 వంటి కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ కేంద్రాల వద్ద తిష్టవేసినా వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడిన ఘటనలను సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆపాదించడం సరైంది కాదన్నారు. మొదటి విడతలో 20 మందిపై, అనంతరం మరో 20 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు, సూత్రధారులంటూ మరో 16 మందిపై కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్ని అకృత్యాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు ఎదుర్కొన్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించడం ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు.

కడప నగరంలో కార్పొరేటర్లను ఎన్నుకున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం సాధించిందని స్పష్టం చేశారు.

లక్షకు పైగా ఓట్ల ఆధిక్యం సాధించామని ప్రచారం చేసుకుంటున్న కూటమి పార్టీకి వాస్తవంగా ప్రజల మద్దతు ఎంత ఉందో ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు.

ప్రజల మనసులను గెలుచుకున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. కూటమి నాయకులు విజయోత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం వారి విజయాన్ని హర్షించడం లేదన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే సరైన తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల పేరుతో అక్రమ కేసులు పెట్టి, భౌతిక దాడులకు పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారిలో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాషా గారు హెచ్చరించారు. చట్టపరంగా ప్రతి ఒక్కరినీ బాధ్యులుగా నిలబెట్టి, ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.

భౌతిక దాడులకు తెగబడి, ప్రజాస్వామ్యాన్ని అణచివేసి సాధించిన గెలుపు నిజమైన గెలుపు కాదు. ప్రజల మనసులను గెలుచుకున్నప్పుడే అది అసలైన విజయం.

ఈ కార్యక్రమంలో SEC సభ్యులు యానాదయ్య, మాజీ కార్పొరేటర్ శ్రీరంజన్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి షిండే రవిచంద్రరావు, నగర కార్యదర్శి మాస్టర్ అహ్మద్,నాయకులు బ్రహ్మానంద రెడ్డి,సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి,నజీర్, ఎద్దుల రామకృష్ణారెడ్డి,నాగేంద్రప్రసాద్, గోపాలకృష్ణ, గంప వీరయ్య, బండి రెడ్డి, బహుజన్ నగర్ వెంకటేష్, రమేష్, మౌలాలి, చంద్రకాంత్, తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి :: నేడు ధన త్రయోదశి

parti naitikakadapanagarammunsipalennikallovaiessarkamgres

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News