‘నాకు బతకాలని లేదు.. చెల్లిని జాగ్రత్తగా చూసుకో’.. తల్లికి మెసేజ్ పెట్టి యువకుడి అదృశ్యం

హైదరాబాద్ : నగరంలోని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఇంటి నుంచి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లికి మెసేజ్ పెట్టిన సదరు యువకుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన తల్లి.. కుమారుడు కనిపించకుండా పోవడంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలోని బొక్కనిగూడలో తల్లి, చెల్లితో కలిసి 20 ఏళ్ల మనోజ్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. జ్వరం కారణంగా నిన్న(ఆదివారం) మనోజ్ ఇంట్లోనే ఉన్నాడు. ఘట్‌కేసర్‌కు వెళ్లిన తల్లి కవిత రాత్రి పది గంటలకు ఇంటికి చేరుకునే సరికి కుమారుడు కనిపించలేదు. ఇంతలోనే కుమారుడి నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్‌తో తల్లి ఆందోళనకు గురైంది. ‘చెల్లిని జాగ్రత్తగా చూసుకో.. నాకు బతకాలని లేదు’ అంటూ తల్లికి యువకుడు మెసేజ్ పెట్టాడు. కుమారుడి మిస్సింగ్‌పై తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు.. మనోజ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోవడం స్థానికంగా సంచలనం రేపింది.
ఇదీ చదవండి :: 'నా దీపావళి గిఫ్ట్ ఎక్కడ?'.. కారును ఆపి బహుమతి అడిగిన హోంగార్డు.. వీడియో వైరల్..












