10/11/2026, Tuesday · 12:49:35 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 3:29 PM జాతీయం 4

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: అతివేగం అత్యంత ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేస్తున్నా.. వాటిని వాహనదారులు లెక్కచేయడం లేదు. మితిమీరిన వేగంతో బైకులపై దూసుకుపోతున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ప్రమాదాల బారిన పడి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. కానీ నూటికో.. కోటికో.. ఒకరు మాత్రమే అదృష్టం కొద్ది ప్రాణాలతో బయట పడుతున్నారు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బైక్ పై అతి వేగంతో గోడను ఢీ కొట్టి.. ఆ పక్కనే ఉన్న బోర్డుకు తగిలాడో ఓ వ్యక్తి. అనంతరం అంతే వేగంతో రోడ్డుపై పడ్డాడు. ఆ తర్వాత అతడు స్వయంగా లేచి నడుచుకుంటూ బైక్ వద్దకు వచ్చాడు. ఇంతలో ఓ కారు అతడి సమీపంలోని వచ్చి ఆగింది. ఇదంతా ఆ పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఇంతలా యాక్సిడెంట్ జరిగినా.. సదరు వ్యక్తికి చిన్న గాయం కాకపోవడం ఆశ్చర్యం.

అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ వీడియోలో మాత్రం నవంబర్ 4వ తేదీన జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను మనీష్ యాదవ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అతడికి దేవుడు రక్షణగా ఉన్నాడు అందుకే ఎటువంటి గాయం కాలేదని ఒకరు పేర్కొన్నారు.

ఇంతగా ప్రమాదం జరిగినా.. అతడికి చిన్నపాటి గాయం కూడా కాకపోవడం ఎలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వెనుక నుంచి ఏ వాహనం వచ్చినా.. అతడి ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉండేదని మరొకరు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి :: 'నా దీపావళి గిఫ్ట్ ఎక్కడ?'.. కారును ఆపి బహుమతి అడిగిన హోంగార్డు.. వీడియో వైరల్..

finally shockedjumpedairlandedroadhappened

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News