క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. 679 బ్రాండ్ల ధరల తగ్గింపు

ఢిల్లీ : క్యాన్సర్ మందుల నూతన తగ్గింపు ధరలు (Cancer Medicine Price Reduction) ఈ రోజు (సోమవారం) నుంచి అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి తగ్గించిన ఎమ్మార్పీకే క్యాన్సర్ మందులు విక్రయించాలని మెడికల్ షాపులు, హాస్పిటళ్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 137 క్యాన్సర్ మందులపై 30% గరిష్ఠ ట్రేడ్ మార్జిన్ కట్ (TMR) నిబంధన అమల్లోకి వచ్చిందని కేంద్రం ప్రకటించింది.679 బ్రాండ్లపై 50% కంటే ధరలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నేటి నుంచి సవరించిన ఎమ్మార్పీలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి రోగులకు రూ.3,540 కోట్ల మేర మందుల ఖర్చులు మిగలనున్నాయి. Pharma Sahi Daam యాప్‌లో కొత్త ధరలు లభ్యం కానున్నట్లు చెప్పింది. ఇవాళ్టి నుంచి పాత లేదా అధిక ధరలకు ఈ మందులను అమ్మితే 1800-111-255కు ఫిర్యాదు చేయాలని ఎన్పీపీఏ అధికారులు (NPPA) సూచించారు.
ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల












