10/11/2026, Tuesday · 12:49:32 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఖర్గే Vs బీజేపీ .. దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 11:40 AM జాతీయం 1

ఖర్గే Vs బీజేపీ .. దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం
Want this news as a newspaper clip?Print News Clip

ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం మొదలైంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ‘సంతోషాల ఈద్’ అని ఖర్గే అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పవిత్ర పండుగలను కూడా రాజకీయాలకు వాడుకుంటోందని కాషాయం పార్టీ నేతలు దుయ్యబట్టారు.ఖర్గే చేసిన వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందూ భక్తుల విశ్వాసాలను, భావోద్వేగాలను గాయపరిచేలా ఉన్నాయని ఆగ్రహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను ‘యాంటీ-సనాతన‘, ‘యాంటీ-హిందూ’ పార్టీగా కమలం పార్టీ నేతలు అభివర్ణించారు. రామ మందిర ప్రాణప్రతిష్ఠ, మహా కుంభమేళా, ఛత్ పూజలపై కాంగ్రెస్ నేతలు గతంలో చేసిన విమర్శలను గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ విరుచుకుపడ్డారు. పండుగల వేళ ప్రజలంతా విభేదాలను మరచి ఐక్యంగా ఉండాలని, దేశ శాంతిభద్రతలను కాపాడాలని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి :: ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు

Political controversyKhargeBJPDiwaliwishes

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News