10/11/2026, Tuesday · 12:49:26 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కాలిపోయిన డాక్యుమెంట్లు

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 10:42 AM రంగారెడ్డి 1

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కాలిపోయిన డాక్యుమెంట్లు
Want this news as a newspaper clip?Print News Clip

చేవెళ్ల : చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో (Chevella Fire Accident) నిన్న (ఆదివారం) రాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భవనంలో నిల్వ ఉంచిన పాత రికార్డులు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, షాద్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మంటలను ఫైర్ సిబ్బంది పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. టపాసుల నిప్పురవ్వల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఎమ్మార్వో కృష్ణయ్య అనుమానం వ్యక్తం చేశారు. కాలిపోయిన రికార్డులు, ఆస్తి నష్టంపై అధికారులు పరిశీలిస్తున్నారు. పాత ఎమ్మార్వో కార్యాలయంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పలు కేసుల వివరాల డాక్యుమెంట్లు కాలిపోయాయి.

ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

breaks outFireoldMROofficeChevellaBurneddocuments

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News