10/11/2026, Tuesday · 12:49:34 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఐపీఎల్ 2027: పవర్ హిట్టర్ అశుతోష్ శర్మపై కన్నేసిన గుజరాత్ టైటాన్స్!

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 10:56 AM క్రీడలు 1

ఐపీఎల్ 2027: పవర్ హిట్టర్ అశుతోష్ శర్మపై కన్నేసిన గుజరాత్ టైటాన్స్!
Want this news as a newspaper clip?Print News Clip

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వ్యవహారం ఎంతగా చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. అదే రీతిలో తెరవెనుక మరికొన్ని కీలక పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న పవర్ హిట్టర్ అశుతోష్ శర్మ ప్రస్తుతం పలు ఫ్రాంచైజీల రాడార్‌లో నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఏకంగా 168.86 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్న ఈ 28 ఏళ్ల పవర్ హిట్టర్‌ను దక్కించుకునేందుకు కొన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు కొన్ని నెలల క్రితమే అశుతోష్ ట్రేడింగ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ను సంప్రదించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ వెల్లడించింది. అయితే డీసీ నుంచి ఎలాంటి స్పష్టతా రాలేదు. కాగా, తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఢిల్లీ జట్టు కొత్త సపోర్ట్ స్టాఫ్‌ను నియమించుకున్న నేపథ్యంలో, ఈ ట్రేడింగ్ అంశంపై మళ్లీ చర్చలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

గత మూడు ఐపీఎల్ సీజన్లలో అశుతోష్ శర్మ లోయర్ ఆర్డర్‌లో వచ్చి.. అద్భుతమైన పిచ్ హిట్టింగ్‌తో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.3.8 కోట్ల భారీ ధరకు అమ్ముడైన అతను.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే కేవలం 31 బంతుల్లో 66* పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే ఎల్ఎస్‌జీ కూడా అశుతోష్‌ను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ల అవసరం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే డీసీ అవసరాన్ని గ్రహించిన జీటీ, ఎల్ఎస్‌జీ కొత్త కొత్త వ్యూహంతో ముందుకెళ్లనున్నట్లు సమాచారం. గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తమ వద్ద అదనంగా ఉన్న పేసర్లను వినియోగించి అశుతోష్ కోసం డీసీతో బేరసారాలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ 2027 వేలానికి ముందు ఈ పవర్ హిట్టర్ ఏ జట్టులోకి మారుతాడనేది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదీ చదవండి :: ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు

Ashutosh SharmaIPLGujaratTitanspowerhitter

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News