యూత్ ఒలింపిక్స్ 2026: ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం

స్పోర్ట్స్ డెస్క్: సెనెగల్ రాజధాని డాకర్ వేదికగా జరుగుతున్న యూత్ ఒలింపిక్స్ 2026లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో భారత అథ్లెట్ శౌర్య అంబురే కాంస్య పతకం గెలిచింది. తద్వారా యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ పతకం అందింది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల శౌర్య అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్‌లో 13.59 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచింది. 0.02 సెకన్ల తేడాతో రజత పతకాన్ని శౌర్య కోల్పోయింది.ఫ్రాన్స్‌కు చెందిన అన్నా పీటర్స్ 13.57 సెకన్లలో టార్గెట్ చేరుకుని రజతం సాధించింది. చైనాకు చెందిన జాంగ్ కెయి 13.17 సెకన్లతో స్వర్ణం కైవసం చేసుకుంది. యూత్ ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ తరఫున పాల్గొన్న ఏకైక అథ్లెట్ అంబూరే కావండ విశేషం. ఆమె ఒక్కరే పాల్గొన్ని.. ఒక మెడల్ తీసుకురావడంతో క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఏడాదిన్నర వ్యవధిలో శౌర్య ఆసియా అండర్-18 ఛాంపియన్ షిప్, ఆసియా యూత్ గేమ్స్, తాజాగా యూత్ ఒలిపింక్స్ ఆటల్లో పతకాలు గెలిచి.. తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది.
ఇదీ చదవండి :: 'నా దీపావళి గిఫ్ట్ ఎక్కడ?'.. కారును ఆపి బహుమతి అడిగిన హోంగార్డు.. వీడియో వైరల్..












