10/11/2026, Tuesday · 12:49:29 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అండాల అక్రమ సేకరణ కేసు..ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులను విచారించనున్న మహిళా కమిషన్

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 10:38 AM హైదరాబాద్ 1

అండాల అక్రమ సేకరణ కేసు..ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులను విచారించనున్న మహిళా కమిషన్
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరణ వ్యవహారంపై తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commission) సీరియస్ అయింది. ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులను మహిళా కమిషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందిరా ఐవీఎఫ్, నర్మద ఫెర్టిలిటీ, ఓయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు ART సెంటర్‌కు, పద్మజ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11:30 గంటలకు మహిళా కమిషన్ ముందు ఐదు సెంటర్ల ప్రతినిధుల హాజరు కావాలని ఆదేశించింది.ఈ క్రమంలోనే బుద్ధభవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయానికి నిర్వాహకులు రానున్నారు. మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, సెంటర్ హెడ్‌లకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఎదుట నిర్వాహకులు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వనున్నారు. మహిళల నుంచి అండాల సేకరణలో నిబంధనల ఉల్లంఘన జరిగిందనే అంశంపై విచారణ జరపనుంది. ఐదు ఫెర్టిలిటీ సెంటర్ల వివరణలను మహిళా కమిషన్ పరిశీలించనుంది. నిర్వాహకుల వివరణ అనంతరం తదుపరి చర్యలపై కమిషన్ స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది.

ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

Case WomenEggProcurementCommissionInquireFertilityCentresManagers

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News