10/11/2026, Tuesday · 12:49:33 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కడప డిప్యూటీ మేయర్ రేసులో సుగవాసి పృథ్వి!

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 3:26 PM వైఎస్సార్ కడప 1

కడప డిప్యూటీ మేయర్ రేసులో సుగవాసి పృథ్వి!
Want this news as a newspaper clip?Print News Clip
  • బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే తెరపైకి సుగవాసి పృథ్వి పేరు!
  • మాజీ కార్పొరేటర్ సుగవాసి చిరంజీవి తనయులుగా రాజకీయాల్లో చురుకైన పాత్ర...

కడప నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ బలిజ సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే ప్రస్తుత కార్పొరేటర్ సుగవాసి పృథ్వి పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

మాజీ కార్పొరేటర్ సుగవాసి చిరంజీవి తనయులు సుగవాసి పృథ్వి, సుగవాసి యువరాజ్ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ పట్ల తమ విధేయతను చాటుకుంటున్నారు.

కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డికి సుగవాసి కుటుంబం అత్యంత నమ్మకమైన కుటుంబంగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు ఉంది. పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న ఈ కుటుంబానికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందా అన్న చర్చ కూడా మొదలైంది.

ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్న సుగవాసి పృథ్వి పేరు డిప్యూటీ మేయర్ పదవికి పరిశీలనలోకి వస్తుందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి నాయకత్వం భావిస్తే పృథ్వి పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కడప నగర రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత, నాయకత్వంతో ఉన్న సంబంధాలు డిప్యూటీ మేయర్ ఎంపికలో ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? బలిజ సామాజిక వర్గానికి ఒక్క అవకాశం దక్కుతుందా? దక్కితే సుగవాసి పృథ్వికి బాధ్యతలు అప్పగిస్తారా?

పార్టీ కోసం పనిచేసిన సుగవాసి కుటుంబానికి పదవితో గుర్తింపు లభిస్తుందా? డిప్యూటీ మేయర్ పీఠంపై సుగవాసి పృథ్వి పేరు ఖరారవుతుందా? అన్నది వేచి చూడాలి.

అయితే డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎంపికపై కూటమి నాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

Mayor raceSugavasiPrithviKadapaDeputy

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News