హైదరాబాద్‌లో టపాసుల వివాదం.. కత్తులతో దాడి, ముగ్గురికి గాయాలు

హైదరాబాద్ : టపాసుల విషయంలో తలెత్తిన చిన్న వివాదం.. కత్తులతో దాడికి దారి తీసింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని బేగంబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడంపై తలెత్తిన చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. గాంధీ భవన్, పటేల్‌నగర్‌లో బాణాసంచా కాలుస్తుండగా నిప్పులు పడటంతో వివాదం మొదలైనట్లు సమాచారం. చిన్న వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో కత్తులతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానికులు చికిత్స నిమత్తం ఆస్పత్రికి తరలించారు. దీపావళి పర్వదినాన ఎంతో ఉత్సాహంగా టపాసులు కాలుస్తున్న సమయంలో ఇలాంటా ఘటన చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల












